స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సిడిపి రిలీజ్ చేసిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్….!!

 118 total views,  1 views today

ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇకపోతే మరొక మూడు రోజుల్లో, అనగా 8వ తేదీన బన్నీ తన 36వ పుట్టిన రోజుని జరుపుకోనున్నారు. అయితే ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ఆయన ఫ్యాన్స్ బన్నీ బర్త్ డే ని బాగా సెలెబ్రేట్ చేయాలని సిద్ధం అవుతున్నారు.

 


అయితే ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో తమకు వీలైన పలు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధం అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అల్లు అర్జున్ ఆర్మీ. కాగా నేడు కాసేపటి క్రితం ఆయన బర్త్ డే కామన్ డిస్ప్లే పిక్చర్ (సిడిపి) ని సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ రిలీజ్ చేస్తూ, బన్నీ కి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *