అల్లు అర్జున్ ‘ఆర్య’ కు 16 ఏళ్లు….!!

 440 total views,  2 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా నిన్నటితో సక్సెస్ఫుల్ గా 16 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అప్పట్లో మంచి అంచనాలతో అల్లు అర్జున్ కెరీర్ సెకండ్ మూవీ గా రిలీజ్ అయిన ఆర్య సంచలన విజయాన్ని అందుకుని హీరోగా అల్లు అర్జున్ కు అతి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది.

alluarjunfanbiswajit on Twitter: "16 years of arya movie ...

అర్జున్ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. కాగా తమ హీరో సినిమా 16 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో నిన్నటి నుండి పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్స్, దానిని ఒక ట్రెండ్ గా సెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిగెత్తిస్తున్నారు….!!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *