17 ఏళ్ళ బన్నీ సినీ ప్రస్థానం ……!!

 154 total views,  2 views today

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో ఒక చిన్న డాన్స్ బిట్ చేసి అందరినీ మెప్పించిన యువ హీరో అల్లు అర్జున్, ఆ తరువాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు.

allu arjun 17 years tfi

ఆపై సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ఆర్యతో మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్, ఆపై వచ్చిన బన్నీ, దేశముదురు, పరుగు, జులాయి, రేస్ గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలానే ఇటీవల వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక నిన్నటితో బన్నీ సినిమా రంగప్రవేశం చేసి 17 ఏళ్ళు పూర్తి అవడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు బన్నీకి అభినందనలు తెలియచేసారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *