237 total views, 1 views today
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్, అది పూర్తి అయిన అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్న సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసేపనిలో దర్శకుడు త్రివిక్రమ్ నిమగ్నం అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్ర కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని, కాగా ఆ పాత్ర కోసం ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమలో విలన్ గా నటించిన అరవింద స్వామి ని తీసుకోవాలని చూస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. అలానే అతి త్వరలో దీనికి సంబంధించి ప్రకటక కూడా రానున్నట్లు చెప్తున్నారు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో చూడాలి……!!