పవన్ ఫ్యాన్స్ కు థమన్ గుడ్ న్యూస్ చెప్పాడుగా….!!

 104 total views,  1 views today

ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ యొక్క అధికారిక తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ తో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన మల్లేశం సినిమా ఫేమ్ అనన్య కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తోందట. 

ఇకపోతే ఈ సినిమా ద్వారా తొలిసారిగా పవన్ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ తో తొలిసారిగా వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అలానే సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని ఇటీవల సిద్ శ్రీరామ్ తో పాడించాం అని, అది ఎంతో అద్భుతంగా వచ్చిందని కొద్దిరోజుల క్రితం థమన్ ట్వీట్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నాం, పవన్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి అంటూ థమన్ కాసేపటి క్రితం ఒక ట్వీట్ చేసారు. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఆనందం మరింత రెట్టింపయింది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *