జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన రాజమౌళి…..!!

 273 total views,  2 views today

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ వీడియో ని ఇటీవల రిలీజ్ చేసిన సినిమా యూనిట్,

 

రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మాత్రం ఎటువంటి వీడియో ని కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ ని కానీ రిలీజ్ చేయడం లేదని ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఎన్నో రోజులుగా తమ హీరో బర్త్ డే నాడు కొమరం భీం ఫస్ట్ లుక్ చూడొచ్చని ఆశపడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆశలపై రాజమౌళి నీళ్లు చల్లారు. అయితే లాక్ డౌన్ వల్లనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ని రిలీజ్ చేయలేకపోతున్నాం అని, కాగా అతి త్వరలో మంచి ముహూర్తం చూసుకుని దానిని రిలీజ్ చేస్తాం అంటూ ఆర్ఆర్ఆర్ యూనిట్ తమ ప్రకటనలో తెల్పింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *