ప్రభాస్ వ్యక్తిత్వం గురించి రాజమౌళి ఏమన్నారంటే……??

 172 total views,  1 views today

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, ఇటీవల ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల సంచలన విజయాలతో మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా విపరీతమైన పేరు, క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఆ తరువాత యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమా విజయంతో తన క్రేజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచుకున్న ప్రభాస్, ప్రస్తుతం పూజ హెగ్డే తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Rajamouli doesn't have dare to compete with Prabhas? - tollywood

కాగా నేడు దర్శకుడిగజం ఎస్ ఎస్ రాజమౌళి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ తో వీడియో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ప్రభాస్ చూడడానికి ఎంతో రిజర్వుడుగా, అలానే ఎంతో సైలెంట్ గా కనపడతారని, అలానే ఆయనతో ఒకసారి మాట్లాడితే, ఇతనికి పెద్దగా ఏమి తెలియదు అమాయకుడిలా, వెర్రిబాగులోడిలా అనిపిస్తాడని అన్నారు. కాగా ఎవరైతే ప్రభాస్ కు దగ్గరా కనెక్ట్ అయి, ఆయనతో ట్రావెల్ చేస్తారో, అటువంటి వారికి ప్రభాస్ లోని ప్రత్యేకత తెలుస్తుందని, ప్రభాస్ వర్కింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమని, అలానే అతడిలో ఒక మంచి ఫిలాసఫర్ దాగి ఉన్నాడని చెప్పిన రాజమౌళి, మన పరిస్థితిని అర్ధం చేసుకుని నడుచుకునే గొప్ప గుణం ప్రభాస్ లో ఉందని అన్నారు……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *