ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా శృతి హాసన్…..??

 671 total views,  1 views today

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమాలో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 2021 జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక సరిగ్గా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవగానే, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్, ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మించే ఈ సినిమాలు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

jr ntr sruthi hassan 1

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ని ఎంపిక చేసినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో తాజాగా ఒక వార్త ప్రచారం అవుతోంది. వాస్తవానికి గతంలో ఒకసారి త్రివిక్రమ్ సినిమాలో శృతికి అవకాశం వచ్చిందని, అయితే అనుకోని కారణాల వలన అది మిస్ అవడంతో, ఇప్పుడు ఎన్టీఆర్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ కి హీరోయిన్ గా శృతి అయితేనే బాగుంటుందని ఆమెని ఎంపిక చేశారట త్రివిక్రమ్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో వాస్తవం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా గతంలో ఎన్టీఆర్ తో కలిసి శృతి రామయ్య వస్తావయ్యా సినిమాలో నటించిన విషయం తెలిసిందే…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *