‘రాజ రాజ చోర’ గా రాబోతున్న హీరో శ్రీ విష్ణు …..!!

 123 total views,  1 views today

మొదటి నుండి తన సినిమా కెరీర్ లో ఒకింత విభిన్న తరహా కథ కథనాలు గల సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న యువ నటుడు శ్రీవిష్ణు. ఎప్పటికప్పుడు ఒక సినిమాతో మరొక సినిమా సంబంధం లేకుండా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో దూసుకుపోతున్న శ్రీవిష్ణు ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు ‘రాజ రాజా చోర’ అనే టైటిల్ ని నిర్ణయించి నేడు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ తో కూడిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసింది.

ఒక విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు కథ, దర్శకత్వం హసిత్ గోలి నిర్వహిస్తుండగా, తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఫోటోగ్రఫి : వేదరామన్, సంగీతం : వివేక్ సాగర్ అందిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *