47 total views, 1 views today
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఇటీవల కొన్నాళ్లుగా ఆడియన్స్ నుండి మంచి అభిమానాన్ని చూరగొంటోంది. మొదటి నుండి తండ్రి మహేష్ బాబు వలే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అందరితో పలు విషయాలు పంచుకుంటున్న సితార ఇటీవల తొలిసారిగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు భవిష్యత్తులో నటిని కావాలని ఉందని, అలానే సింగర్ గా కూడా మారాలని కోరుకుతున్నట్లు ఆమె తెలిపింది.
ఇక ఇటీవల సితార ఒక ఫోటోషూట్ లో దిగిన ఫోటోలను ఆమె తల్లి నమ్రత తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అవి ఎంతో వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా పింక్ డ్రెస్ లో ఏంజెల్ లుక్ లో సితార అదరగొట్టే ఫోటోలు కొద్దిసేపటి క్రితం నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే ఈ విధమైన క్రేజ్ తో దూసుకెళ్తుంటే రేపు పెద్దయ్యాక సీతరా ఇంకెంత రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంటుందో అంటూ ఆమెపై పలువురు ఆడియన్స్, ఫ్యాన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు……!!