షాకింగ్ : హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా…..??

 261 total views,  1 views today

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్‌ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఎంతో అన్యోన్యంగా జీవితం ఆరంభించిన ఈ జంటను కరోనా మహమ్మారి కాటేసినట్లు తెలుస్తోంది. నేడు బాంబే టైమ్స్ అనే పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రియ కొన్ని దారుణమైన విషయాలు తెలిపారు. ప్రస్తుతం తన భర్త, తాను స్పెయిన్ లోని బార్సిలోనా లో ఉన్నాం అని, ఇక్కడ ఇప్పటికే 1.7 లక్షలకు పైగా కరోనా బాధితులు ఉన్నారని అన్నారు. బయటి పరిస్థితులు తలుచుకుంటుంటే ఎంతో భయంగా ఉందని, దేశాన్ని మొత్తం లాకౌట్ చేయడంతో పాటు ఏదైనా అవసరం ఉంటే ఇంటికి ఒకరు చొప్పున బయటకు పంపుతున్నారని అన్నారు.

Shriya Saran on her hush-hush wedding with Andrei Koscheev: I like ...

ఇక ఇటీవల మార్చి 13న తమ పెళ్లిరోజు సందర్భంగా తన భర్త ఆండ్రీ కొశ్చీవ్‌ తో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఆ వేడుకను జరుపుకున్నాం అని, అప్పటికి  ఇక్కడ కవర్ణ లేదని, అయితే ఆ తరువాత ఒక రోజు ఆండ్రీ కి సడన్ గా విపరీతమైన జ్వరం, దగ్గు పెరగడంతో అనుమానం వచ్చి చెక్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రస్తుతం ఇద్దరం కొద్దిరోజులుగా వేరువేరు గదుల్లో ఉంటున్నాం అని అన్నారు. అయితే ప్రస్తుతం ఆండ్రీ కోలుకుంటున్నాడని, మన దేశాన్ని ఎంతో మిస్ అవుతున్నాని చెప్పిన శ్రియ, ఎప్పుడు ఇక్కడకి వస్తానా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు శ్రియ……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *