నా హెల్త్, ఫిట్ నెస్ సీక్రెట్ అదే : హీరోయిన్ శ్రద్ధ కపూర్ 

 132 total views,  1 views today

బాలీవుడ్ కి ఆషీకీ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కపూర్, మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత నుండి బాలీవుడ్ లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న ఆమె, ఇటీవల ప్రభాస్ సరసన సాహో సినిమాలో కూడా నటించిన ఈ భామ, ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో ఇంట్లోనే సరదాగా ఫ్యామిలీ తో కలిసి గడుపుతోంది. అయితే ఎందరో తన ఫ్యాన్స్ తన ఫిట్ నెస్, హెల్త్ సీక్రెట్ ఏంటని అడుగుతున్నారని, అయితే తన ఫిట్ నెస్ కు కారణం తాను తరచూ డ్యాన్స్ చేయడమని చెప్పింది శ్రద్ధ.

 

నిజానికి తనకు చిన్నప్పటి నుండి డాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం అని, మధ్యలో డాన్స్ చేసే సమయంలో ఏవైనా కొంత తప్పులు దొర్లితే తన శిక్షకుల నుండి నేర్చుకుంటానని, ఈ విధంగా ఎప్పటికప్పుడు డాన్స్ చేస్తుండడం వలన మంచి ఫిట్ నెస్ తో పాటు మానసికోల్లాసం కూడా లభిస్తుందని శ్రద్దా తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తూ తెల్పింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *