‘శ్రద్ధ కపూర్’ బర్త్ డే స్పెషల్ ఫోటోలు…..!!

 486 total views,  1 views today

బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఆషికీ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రద్ధ కపూర్. ఆమె తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించడం జరిగింది. ఇక తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన శ్రద్ధ, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. ఇక ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా ఎంతో చేరువైన శ్రద్ధ, ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తోంది.

అయితే అవకాశం వస్తే మరొక్కసారి సౌత్ లో నటించాలని అంటున్న శ్రద్ద, తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం అని, తన ప్రక్కన అవకాశం వస్తే చాలు, ఎటువంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అని పలుమార్లు చెప్పడం జరిగింది. ఇకపోతే నేడు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఇక ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె ఫ్యాన్స్ విషెస్ ని అందిస్తూ హడావుడి చేస్తున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *