శర్వానంద్ ‘శ్రీకారం’ ఫస్ట్ లుక్ టీజర్ అదిరింది…..!!

 140 total views,  1 views today

యువ నటుడు శర్వానంద్ నేడు తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఐదవ తారీఖు సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శర్వా, ఆ తరువాత యువ సేన, అమ్మ చెప్పింది, వీధి, గమ్యం, అందరి బంధువయా, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు తదితర సినిమాలతో నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బి కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇకపోతే ఈ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని బట్టి చూస్తే సినిమా పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. మంచి కుటుంబ బంధాల నేపథ్యంలో పలు ఎంటర్టైన్మెంట్ హంగులను కలగలిపి దర్శకడు కిశోర్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువరాజ్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *