165 total views, 1 views today
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఒక ఆర్మీ మేజర్ గా నటించి తన అద్భుతమైన యాక్షన్ తో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించడం జరిగింది.
ఇకపోతే ఈ సినిమాలోని ‘హీ ఈజ్ సో క్యూట్’ సాంగ్ నిన్నటితో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ తో 603కె లైక్స్ తో ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకుంది. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ సాంగ్ ని మరింత వైరల్ చేసేస్తున్నారు……!!