238 total views, 1 views today
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ ఫస్ట్ టైం ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ళ విరామం తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇచ్చారు.
ఆకట్టుకునే కథ, కథలతో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఇటీవల దీనిని ఉగాది పండుగ కానుకగా జెమినీ టివిలో ప్రదర్శించగా ఏకంగా 23.40 రేటింగ్స్ ని దక్కించుకున్నట్లు కాసేపటి క్రితం అధికారిక న్యూస్ బయటకు వచ్చింది. కాగ్ అంతకముందు ప్రభాస్ నటించిన బాహుబలి 2, 22.70 అలానే బాహుబలి 21.84 రేటింగ్స్ తో మొదటి రెండు స్థానాల్లో నిలవగా, ప్రస్తుతం సరిలేరు వాటి రెండిటిని వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది…..!!