సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో అక్కడ కూడా దుమ్ము రేపుతున్నాయట ….!!

 145 total views,  1 views today

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి ల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా కూడా సరిగ్గా అదే సమయంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

 

ఇక ఇటీవల ఈ రెండు సినిమాలు కూడా డిజిటల్ మీడియా మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చాయి. సరిలేరు అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకులకు, అలానే అల సినిమా సన్ నెక్స్ట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ రెండు సినిమాలు కూడా ఆయా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కూడా మంచి వ్యూయర్ షిప్ తో దూసుకెళ్తున్నట్లు టాక్. ఇటీవల థియేటర్స్ లోకి వచ్చి సక్సెస్ సాధించిన ఈ రెండు సినిమాలు, ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా దూసుకెళ్తుండడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *