166 total views, 3 views today
మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్సకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాలు రెండు కూడా మంచి హిట్స్ ని అందుకోవడం జరిగింది. ఇక ఆ సమయంలో రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ విషయమై మంచి పోటీ నెలకొనడం జరిగింది.
ఇక ఇటీవల సరిలేరు సినిమాని జెమినీ టివిలో ప్రదర్శించగా, ఆ సినిమాకు 23.4 టిఆర్పి రేటింగ్స్ రావడం జరిగింది. అయితే రాబోయే మే నెల 2వ తేదీన అలవైకుంఠపురములో సినిమాని జెమినీ టీవీ లో ప్రదర్శించనున్నట్లు సమాచారం. మరి ఆ రోజున అల ఎంతమేర రేటింగ్ రాబడుతుందో, ఏ విధంగా సరిలేరుని ఎదుర్కొంటుందో చూడాలి. ఈ విధంగా మరొక్కసారి ఈ రెండు సినిమాల మధ్య మంచి ఆసక్తికర పోటీ నెలకొన్నట్లయింది….!!