సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ 50 డేస్ సక్సెస్ సెలబ్రేషన్స్…..!!

 110 total views,  3 views today

సూపర్ స్టార్ మహేష్ హీరోగా యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు, కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియా నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఇకపోతే ఈ సినిమా మొన్నటితో సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఊరూరా ఆ సక్సెస్ ని ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఇక నిన్న ఈ సినిమా 50 డేస్ వేడుకను సినిమాకు సంబందించిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమక్షములో హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించగా కె రాఘవేంద్ర రావు, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పలువురు డిస్ట్రిబ్యూటర్లకు షీల్డులు అందచేశారు. సినిమా సూపర్ స్టార్ సక్సెస్ కావడానికి సూపర్ స్టార్ మహేష్, తో పాటు దర్శ నిర్మాతలు ప్రధాన కారణం అని, ఆయన చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో పండించిన ఎంటర్టైన్మెంట్ తనకు ఎంతో నచ్చిందని వివి వినాయక్ అన్నారు. మహేష్ సినిమా ఎప్పుడు సక్సెస్ అయినా ఎంతో సంతోషించేవారిలో నేను అందరికంటే ముందుంటానని రాఘవేంధ్ర రావు అన్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *