ట్విట్టర్ లో సంచలన రికార్డు నమోదు చేసిన సమంత……!!

 412 total views,  2 views today

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఇటీవల తన పుట్టినరోజుని కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. అంతేకాక ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ దానిని ఒక సంబరంగా జరుపుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకునే అలవాటున్న సమంత,

EW2ofFWUEAAqYnc

నేడు తన ట్విట్టర్ అకౌంట్ లో మొత్తంగా 8 లక్షల మంది ఫాలోవర్లను చేరుకున్నారు. ఈ విధంగా మొత్తంగా సౌత్ ఇండియాలోనే అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్ గా ఆమె సరికొత్త రికార్డు ని దక్కించుకున్నారు. కాగా తమ హీరోయిన్ ఈ అద్భుత రికార్డు ని సొంతం చేసుకోవడంతో సమంత ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *