118 total views, 1 views today
సమంత రూత్ ప్రభు, తొలి సినిమా ఏ మాయ చేసావే తో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది అనే చెప్పాలి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆ సినిమా తరువాత వరుసగా ఆమె నటించిన బృందావనం, దూకుడు, ఈగ, సహా ఇక అక్కడి నుండి చేసిన సినిమాల్లో చాలావరకు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. దానితో టాలీవుడ్ లో సమంతకు విపరీతంగా క్రేజ్ ఏర్పడి ఆమె స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు సంపాదించారు.
ఇక మూడేళ్ళ క్రితం అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న అనంతరం, కొంత ఆలోచితూచి సినిమాలు చేస్తున్న సమంత, గత ఏడాది మజిలీ, యు టర్న్, ఓ బేబీ సినిమాలతో సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఇటీవల జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత, నేటితో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి ప్రవేశించి సక్సెస్ఫుల్ గా 10 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఆమెకు అభినందలు తెలుపుతున్నారు…..!!