139 total views, 1 views today
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత అక్కినేని నేటితో తన 33వ ఏట అడుగుపెట్టారు. ముందుగా సరిగ్గా పదేళ్ల క్రితం నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ఏ మాయ చేసావే’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి, ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలతో పాటు వరుసగా విజయాలు అందుకుంటూ నేడు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు.
ఇటీవల నాగ చైతన్యను వివాహమాడిన సమంత, ఒకప్పటిలా కాకుండా ఎంతో ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నేడు తన భార్య జన్మదినం సందర్భంగా నాగ చైతన్య ఆమె కోసం స్పెషల్ గా కేక్ ని తాయారు చేయడం జరిగింది. ఆ కేక్ ఫోటో ని సమంత తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు సమంత. కాగా పలువురు అభిమానులు, సినిమా ప్రముఖులు సమంత సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు…..!!!