‘సోలో బ్రతుకే సో బెటర్’ సెన్సార్ రివ్యూ : మైండ్ బ్లాక్ అయిందట భయ్యా ….!!

 141 total views,  1 views today

యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. పెళ్లి చేసుకోకుండా ఉండిపోదం అనుకున్న ఒక బ్యాచిలర్ అనుకోని కొన్ని ఫ్యామిలీ సమస్యల వలన పెళ్లి చేసుకుంటాడు, ఇక అతడి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుని క్లీన్ యు సర్టిఫికెట్ ని అందుకుంది.
Hey Idi Nenena from Solo Brathuke So Better on 26th Aug - tollywood
కాగా ఈ సినిమాని దర్సకుడు సుబ్బు ఎంతో అద్భుతంగా తీసాడని, ఇక హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ నభ నటేష్ ల నటన సినిమాలో అదిరిపోయిందని అంటున్నారు. యువతతో పాటు అందరు ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా సినిమా తీసిన దర్శకుడు సుబ్బు ని సెన్సార్ సభ్యులు అబినందించాడట. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎటువంటి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే …!!​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *