226 total views, 1 views today
ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ కొట్టిన యువ దర్శకుడు దేవా కట్ట, ఆ తరువాత నాగ చైతన్య హీరోగా ఆటో నగర్ సూర్య సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అతి త్వరలో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో ఆయన తన తదుపరి సినిమా చేయనున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇప్పటికే ప్రతిరోజు పండగే సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ మీదున్న తేజ్ కు, ఇటీవల దేవా కట్ట ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ వినిపించాడని, అది ఎంతో నచ్చిన తేజ్, అతి త్వరలో ఆ సినిమాని చేద్దాం అని మాటిచ్చాడట. ఒక ప్రముఖ నిర్మాత నిర్మించనున్న ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దేవా కట్ట గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ ఆడిపోనుందని అంటున్నారు….!!