ఆ రోజున ‘ఆర్ఆర్ఆర్’ నుండి భారీ అప్డేట్ రాబోతుందా…??

 165 total views,  1 views today

తెలుగు సినిమా పరిశ్రమ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, అలానే టైటిల్ పోస్టర్ని ఈ నెల 25వ తారీఖున ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేయటానికి రాజమౌళి అండ్ టీం సిద్దమైనట్లు టాలీవుడ్ వర్గాల టాక్.  

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న థియేటర్స్ లోకి తీసుకు వస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఉగాది రోజున ఈ సినిమా  నుండి నిజంగానే అప్డేట్ వచ్చినట్లయితే, అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా అది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *