‘ఆర్ఆర్ఆర్’ లో కొమరం భీం ఫస్ట్ లుక్ టీజర్ హైలైట్స్ ఇవే…. నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలే …??

 668 total views,  1 views today

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రాజమౌళి తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా విజయేంద్రప్రసాద్ కథని, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు.

Jr NTR's First look from RRR Movie | Jr NTR Komaram Bheem First Look | RRR Movie Motion Poster | FL - YouTube

ఇకపోతే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే అల్లూరి పాత్ర యొక్క ఇంట్రో వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది మూవీ యూనిట్. ఈనెల 22న ఎన్టీఆర్ కొమరం భీం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానుంది. కాగా ఈ టీజర్ లో ఎన్టీఆర్ అదిరిపోయే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు చెప్తున్నారు. కీరవాణి ఈ టీజర్ కు గూస్ బంప్స్ వచ్చేలా బ్యాక్ స్కోర్ ఇచ్చారని, ఒకరకంగా ఈ టీజర్ నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అంటున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *