​వామ్మో …. ‘కొమరం భీం’ ప్రీ లుక్ టీజర్ కుమ్మిందిగా ….!!​

 127 total views,  5 views today

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకడిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయింది. ఇక ఈ సినిమా నుండి ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం పాత్ర యొక్క ఫస్ట్ లుక్ టీజర్ రేపు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
RRR Motion Poster-NTR-Ramcharan-SS.Rajamouli - Movietik
ఇప్పటికే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ కు ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా కొమరం భీం టీజర్ యొక్క ప్రీ లుక్ ని కొద్దిసేపటి క్రితం రామ్ చరణ్ రిలీజ్ చేయగా, జక్కన్నతో జాగ్రత్త సోదరా అంటూ చరణ్ ట్వీట్ ని రీట్వీట్ చేశారు ఎన్టీఆర్. కాగా ప్రస్తుతం ఆ ప్రీ లుక్ టీజర్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. ….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *