206 total views, 1 views today
టాలీవుడ్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మన తెలుగు భాష ఎల్లలు దాటి దేశ, విదేశాల్లో కూడా విపరీతమైన పేరు, క్రేజ్ ని సంపాదించడం జరిగింది. బాహుబలి రెండు భాగాల అత్యద్భుతన విజయాల తరువాత ప్రభాస్, ఎవరూ అందుకోలేని ఎత్తుకి ఎదిగిపోయారు. ఇకపోతే నిన్న ఆయన గురించి, మిర్చి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన రిచా గంగోపాధ్యాయ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.
ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చినా రిచా, తనకు ప్రభాస్ తో కలిసి మిర్చి సినిమా చేసిన అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనని, ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అని, అలానే సెట్ లో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే అలవాటున్న ప్రభాస్, అందరినీ కూడా చక్కగా రుచికరమైన భోజనాలు వడ్డించి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారని కితాబిచ్చింది. రిచా ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు…..!!