ఫైట్స్ తో పాటు రొమాంటిక్ అందాలతో రామ్ గోపాల్ వర్మ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’…!!

 191 total views,  1 views today

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన రేంజ్ ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం పూజ బాలేకర్ ప్రధాన పాత్రలో ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమాని తీస్తున్నారు వర్మ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్, సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో వర్మ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు టాక్.

ఇక ఈ ఆడ బ్రూస్ లీ, కేవలం ఫైట్స్ మాత్రమే కాదు సినిమాలో కొంత రొమాన్స్ కూడా చేస్తుందట. ఇక ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ విశాఖపట్నం లోని ఆర్కే బీచ్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా నటి పూజ, ఎంతో రొమాంటిక్ గా స్విమ్ సూట్ వేసుకుని పరిగెత్తుతున్న ఫోటోని వర్మ నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *