329 total views, 2 views today
రాజ్ తరుణ్ హీరోగా యువ దర్శకడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో కె. కె. రాధామోహన్ నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఇటీవల కొన్నాళ్లుగా సక్సెస్ కోసం తపిస్తున్న యువ నటుడు రాజ్ తరుణ్ నటించిన ఈ ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్స్ గా మాళవిక నాయర్, హెబ్బా పటేల్ నటించగా సీనియర్ యాక్టర్ నరేష్, వాణి విశ్వనాధ్, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, సప్తగిరి, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ….!!
కథ :
కథ పరంగా చెప్పుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలోని శ్రీను ఉరఫ్ బుజ్జిగాడికి (రాజ్ తరుణ్) తల్లితండ్రులు పెళ్లి చేయాలని చూస్తుండగా, అది ఇష్టం లేని అతడు హైదరాబాద్ వచ్చేస్తాడు. అయితే అంతకుముందే సృజన (హెబ్బా పటేల్) ని ఇష్టపడుతున్న బుజ్జిగాడు వస్తున్న ట్రైన్ లోనే అనుకోకుండా అదే ఊరికి చెందిన కృష్ణవేణి (మాళవిక నాయర్) కూడా హైదరాబాద్ వస్తుంది. అయితే వారిద్దరినీ చూసిన ఊరిలోని ఒక వ్యక్తి బుజ్జిగాడే కృష్ణవేణిని తీసుకుని పారిపోతున్నాడని భావించి ఊరంతా పుకారు పుట్టిస్తాడు. అక్కడి నుండి మంచి రసవత్తరంగా మారిన కథలో ఆ తరువాత బుజ్జి, కృష్ణవేణి ఇద్దరూ ప్రేమలో పడడం, ఆపై ఒక సందర్భంలో అనుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయే కృష్ణవేణి అని తెలియక ఆమెను వాళ్ళ బాబాయికి బుజ్జిగాడు అప్పగించడం జరుగుతుంది. తరువాత ఆమే కృష్ణవేణి అని తెలుసుకున్న బుజ్జిగాడు తన గురించి ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడడం, అనంతరం జరిగిన కొన్ని ఘటనల తరువాత వారిద్దరూ నిజానిజాలు తెల్సుకుని కలిసిపోవడంతో కథ సుఖంఠం అవుతుంది.
విశ్లేషణ :
ఇక సినిమాలో ఎప్పటిమాదిరిగా బుజ్జిగాడి పాత్రలో హీరో రాజ్ తరుణ్ మంచి పెర్ఫార్మన్స్ కనబరిచాడు అనే చెప్పాలి. అలానే హీరోయిన్స్ ఇద్దరూ కూడా తమ అందం, అభినయంతో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకడు విజయ్ కుమార్ కొండా తీసిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, వాణి విశ్వనాధ్ ల పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక బుజ్జిగాడి స్నేహితుల పాత్రధారులు కూడా కొన్ని సీన్స్ లో నవ్వులు పూయిస్తారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైనింగ్ గా సాగగా, సెకండ్ హాఫ్ మరింతగా గిలిగింతలు పెడుతూ సాగుతుంది. వాస్తవానికి కథ పరంగా ఇంతకమందు గతంలో ఇటువంటి సినిమాలు వచ్చినప్పటికీ, ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మంచి ఎంటర్టైనింగ్ గా స్క్రిప్ట్ రాసుకున్న దర్శకుడికి మంచి మార్కులే పడతాయి. అనూప్ రూబెన్స్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఆకట్టుకునే విజువల్స్, నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
ఎంటర్టైనింగ్ గా సాగె కథనం
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ ల నటన
సాంగ్స్
కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
సినిమా లెంగ్త్
చివరిగా :
మొత్తంగా ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ కు ఈ సినిమా గొప్ప హిట్ ని అందించింది అని చెప్పలేకపోయినా అతడి నుండి మంచి సినిమాని ఆశిస్తున్న ప్రేక్షకులను ఈ సినిమా చాలావరకు ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. కొత్త సీసాలో పోసిన పాత సారా మాదిరిగా ఉన్నా, దర్శకడు కథనాన్ని నడిపించిన తీరు, నటీనటుల పెర్ఫార్మన్స్ వెరసి ఈ సినిమాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి. మొత్తంగా అనుకున్నదొక్కటి అయినది మరొక్కటి అనే చందాన సినిమాలో బుజ్జిగాడి కథ సాగినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పవచ్చు….!!
రేటింగ్ : 3.5 / 5