కరోనా ఎఫెక్ట్ తో మాస్క్ ధరించిన ప్రభాస్… మ్యాటర్ ఏంటంటే….??

 248 total views,  1 views today

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన వరుస విజయాల హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుండగా కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ అతి త్వరలో యూరోప్ లో జరగనుండగా, నేడు ప్రభాస్ ఆ దేశానికి పయనమయ్యారు.

ఆ సందర్భంగా నేడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియా కంటపడింది ప్రభాస్, తన పేస్ కి మాస్క్ ధరించి కనిపించరు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్లనే ప్రభాస్ ముందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా మాస్క్ ధరించారని అర్ధం అవుతోంది. ఇక ఈ తాజా షెడ్యూల్ అనంతరం ఆ సినిమా దాదాపుగా 50 శాతానికి పైగా పూర్తి అవుతుందని, అనంతరం సినిమా గురించిన పూర్తి వివరాలు, రిలీజ్ తేదీ వంటివి ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *