బిగ్ బ్రేకింగ్ : రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ అనౌన్సుమెంట్…..డైరెక్టర్ ఎవరంటే….??

 128 total views,  1 views today

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుందా ప్రభాస్ పెద్ద నాన్న అయిన కృష్ణంరాజు ఈ సినిమాలో ఒక  కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమాకు సంబందించిన ప్రకటన కాసేపటి క్రితం రావడం జరిగింది. 

టాలీవుడ్ లోని బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా తమ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా తదుపరి సినిమాని వారు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో వైజయంతి బ్యానర్ పై మహానటి సినిమాని తీసి గొప్ప హిట్ కొట్టిన నాగ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే తొలిసారిగా ప్రభాస్ తో నాగ అశ్విన్ సినిమా రానుండడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *