139 total views, 1 views today
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ఇండియాలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత తన రేంజ్ ని అలానే మార్కెట్ స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు. గతంలో వచ్చిన సాహో సినిమాకు కూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్,
అతి త్వరలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రారంభం కానున్న సినిమా కోసం ఏకంగా రూ.70 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. సాహో తరువాత అటు నార్త్ లో కూడా ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిందని, ప్రస్తుతం బాలీవుడ్ హీరోల రేంజ్ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ కు రూ.70 కోట్ల భారీ మొత్తం ఇచ్చి, నిర్మాత అశ్వినీదత్ తమ బ్యానర్ లో సినిమాని ఒప్పించారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే, ప్రభాస్ టాలీవుడ్ హీరోస్ అందరిలోకి ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుని నెంబర్ వన్ హీరోగా నిలిచినట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!