నాగ అశ్విన్ సినిమాకు ప్రభాస్ తీసుకుంటోంది అంత భారీ రెమ్యునరేషనా….??

 204 total views,  1 views today

రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సాహో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించినాడు. మంచి కమర్షియల్ హంగులతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాదించింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ మూవీ లో నటిస్తున్న ప్రభాస్, దాని అనంతరం మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో ప్రారంభించి, వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం దర్శకుడు అశ్విన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ.70 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికీ బాలీవుడ్ హీరోల రేంజ్ కు చేరుకున్న ప్రభాస్, ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కనున్న ఆ మూవీ కోసం ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోవడం కరెక్ట్ అని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఒకరకంగా ఇప్పటివరకు ఏ తెలుగు నటుడు కూడా ఇంతటి భారీ రెమ్యునరేషన్ తీసుకోలేదని అంటున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *