473 total views, 1 views today
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారిపై విరుచుకుపడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ లాక్ డౌన్ సమయంలో అనేక సినిమాలు వీలైనంతలో ఎంతో కొంత పబ్లిసిటీ చేసుకుంటుంటే యువి క్రియేషన్స్ వారు మాత్రం ప్రభాస్ సినిమా విషయమై ఏమి పట్టించుకోవడం లేదని, కావున దయచేసి తమ హీరో సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుంటుందని వారు మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు…..!!!