బ్రేకింగ్ : మెగాస్టార్ ని డైరెక్ట్ చేయనున్న రెబల్ స్టార్ దర్శకుడు…..!!

 119 total views,  2 views today

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి, రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాని ఎంతో భారీగా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇటీల మోహన్ లాల్ నటించిన మలయాళ హిట్ మూవీ లూసిఫెర్ తెలుగు హక్కులు కొనుగోలు చేసిన రామ్ చరణ్, అతి త్వరలో తన తండ్రి మెగాస్టార్ హీరోగా దానిని కూడా ఎంతో భారీగా నిర్మించనున్నారు.

I don't read reviews: Sujeeth Reddy

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో వంటి గ్రాండ్ స్టైలిష్ సినిమాని తీసిన యువ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్, మెగాపవర్ స్టార్ లను కలిసిన సుజీత్, ఈ అబ్దుత అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అయ్యేలా తీస్తానని చెప్పడం జరిగిందట. అతి త్వరలో ఈ విషయమై సినిమా యూనిట్ నుండి అఫిషియల్ స్టేట్మెంట్ కూడా రానున్నట్లు చెప్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *