181 total views, 1 views today
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి చేసుకుంది. ఇకపోతే ప్రభాస్ కెరీర్ లో 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా డార్లింగ్.
హృదయానికి హత్తుకునే మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ కొట్టింది. కాగా నేడు ఈ సినిమా సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకోవడంతో పలువులు ప్రభాస్ ఫ్యాన్స్, తన హీరో తో పాటు పలువురు సినిమా యూనిట్ సభ్యులకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అబినందనలు తెలియచేస్తున్నారు…..!!