రవితేజ ‘క్రాక్’ రిలీజ్ వాయిదా పడనుందా….??

 194 total views,  1 views today

మాస్ మహారాజ రవితేజ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ క్రాక్. రవితేజ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు నటుడు సముద్ర ఖని పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

Ravi Teja on Twitter: "Wishing you all a Happy Sankranthi!! #Krack… "

కాగా ఈ సినిమాని ముందుగా మే 8న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశాన్ని పూర్తిగా రాబోయే మే 3 వరకు లాకౌట్ ప్రకటించడంతో జూన్ లేదా జులై నెలకు క్రాక్ ని వాయిదా వేయాలని నిర్ణయించారట దర్శక నిర్మాతలు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకు బి మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని మరికొద్దిరోజుల్లో అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *