195 total views, 1 views today
నేడు టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇద్దరు ఒకేరోజున పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కాగా వారిలో ఒకరు రష్మిక మందన్న, మరొకరు కళ్యాణి ప్రియదర్శన్. ముందుగా ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, అలానే భీష్మ సినిమాలతో మంచి హిట్స్ కొట్టి ప్రస్తుతం బన్నీ సరసన సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తోంది.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్, ఆపై చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇక నేటితో రష్మిక 24వ ఏట అడుగుపెడుతుండగా, కళ్యాణి 28వ అడుగిడుతోంది. ఇక వీరిద్దరికి పలువురు టాలీవుడ్ ఫ్యాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు….!!