138 total views, 1 views today
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని యువ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. అలానే దీనితో పాటు క్రిష్ దర్సకత్వంలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఒక పీరియాడికల్ మూవీ కూడా చేస్తున్న పవర్ స్టార్, దాని అనంతరం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే, పవన్ మరియు హరీష్ శంకర్ ల సినిమాకు పవన్ చిరకాల మిత్రుడు, ఆయనకు గతంలో తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం సినిమాలకు మ్యూజిక్ అందించిన రమణ గోగులను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు మాత్రం వెల్లడి కావలసి ఉండగా, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని, ఎందుకంటే ఇదే జరిగితే మరొక్కసారి పవన్, రమణ గోగుల కాంబోలో మరొక మ్యూజికల్ హిట్ వచ్చినట్లే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు…..!!!