రామ్ ”రెడ్” మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్….!!

 253 total views,  1 views today

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’. కొద్దిరోజుల క్రితం తమిళ్ లో యువ నటుడు అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తడం అనే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ సంపాదించింది. రామ్ తొలిసారిగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, సమీర్ రెడ్డి ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా నుండి ‘నువ్వే నువ్వే’ అంటూ సాగె మెలోడియస్ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ప్రకటించింది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. కాగా గతంలో రామ్, కిశోర్ తిరుమల కలయికలో వచ్చిన నేను శైలజ మంచి హిట్ సాధించగా, ఆపై వచ్చిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా కూడా బాగానే ఆడింది. మరి ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడవ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *