166 total views, 1 views today
టాలీవుడ్ యంగ్ హీరో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం టాలీవడో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో మరొక యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆ సినిమాలో కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇకపోతే నేడు మెగాస్టార్ ది లెజెండ్ అనే బుక్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది.
కాగా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్, తన లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. కోరం మీసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ వేడుకకు విచ్చేసిన చరణ్ ని చూడగానే మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనంద పరవశులయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన లేటెస్ట్ లుక్ ఫోటోలు పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి…. !!