రామ్ చరణ్ అల్లూరి లుక్ రిలీజ్ చేసిన కొమరం భీం ఎన్టీఆర్ : వీడియో వైరల్…..!!

 202 total views,  1 views today

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా సినిమా రౌద్రం రణం రుధిరం. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అత్యంత భారీ ఖర్చుతో డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కాసేపటి క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పరిచయ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది.

ఇక ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయి. ‘ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ తో పాటు వీడియో లో రామ్ చరణ్ అత్యద్భుతమైన షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎఫెక్ట్స్ వంటివి సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెంచాయి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *