రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ టాక్ : ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడే….!!

 187 total views,  1 views today

యువ నటుడు రాజ్ తరుణ్, ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నటించిన ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ కొట్టిన రాజ్ తరుణ్, ఆపై వచ్చిన ‘సినిమా చూపిస్త మామ’ సినిమాతో మరొక హిట్ దక్కించుకున్నాడు. ఆ తరువాత కుమారి 21ఎఫ్ తో పాటు కొద్దిరోజుల క్రితం విష్ణు తో కలిసి నటించిన ఈడో రకం ఆడో రకం సినిమాతో మరొక విజయం అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన నటిస్తున్న సినిమాలు ఆశించిన మేరకు సక్సెస్ ని అందుకోలేకపోవడంతో, కొద్దిరోజుల క్రితం కొంత ఆలోచన చేసిన రాజ్ తరుణ్, తన తదుపరి సినిమాని యువ దర్శకుడు విజయ్ కుమార్ కొండకు అప్పగించారు.

శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే సినిమా మంచి ఫన్నీ గా సాగనున్నట్లు అర్ధం అవుతుంది. మధ్యలో అక్కడక్కడా వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు పలు ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా సాగనున్నట్లు కొంతవరకు మనకు ట్రైలర్ ని చూస్తే అర్ధం అవుతుంది.

‘అమ్మాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు, కానీ యాక్సెప్ట్ చేయడానికి మాత్రం చేతులు పిసుక్కుంటారు’…. ‘ఒక పద్దెనిమిదేళ్ల కత్తి లాంటి అమ్మాయి ఫోటో పంపావు సరే, బట్టలేసి పంపించరా’ అంటూ ట్రైలర్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్  బాగున్నాయి. వాణి విశ్వనాధ్, పోసాని కృష్ణ మురళి, రాజారవీంద్ర, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తుంటే తప్పకుండ ఈ సారి రాజ్ తరుణ్ గట్టిగానే హిట్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు ప్రేక్షకులు. కాగా ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని ఉగాది కానుకగా ఈనెల 25న రిలీజ్ చేయనున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *