157 total views, 2 views today
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పాత్ర తాలుకు ఇంట్రడక్షన్ వీడియో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఇకపోతే నిన్న ఈ సినిమా కథ యొక్క మెయిన్ థీమ్ ని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు.
నిప్పు, నీరు అనేవి రెండూ కూడా ఒకనికొకటి అంతం చేయగల విభిన్నమైన భావాలు గల శక్తివంతమైనవి, అయితే అటువంటి శక్తివంతమైనవి రెండూ కలిస్తే మన ప్రపంచం మొత్తాన్ని తమ శక్తితో ఒక మోటార్ మాదిరిగా ముందుకు నడిపించే ఫోర్స్ ని కలిగి ఉంటాయి అనే థీమ్ తో ఈ సినిమా రూపొందుతోందని అన్నారు. కాగా ఇదే హింట్ ని రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో హీరోలిద్దరిలో ఒకరు అగ్ని, మరొకరిని నీరుగా చూపించడం జరిగింది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎంతమేర సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే 2021, జనవరి 8 వరకు ఆగాల్సిందే….!!