201 total views, 1 views today
ప్రస్తుతం టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’. మెగా, నందమూరి హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి తొలిసారిగా టాలీవుడ్ తెరపై కనిపించనున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో తో పాటు, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవల రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
ఇకపోతే కాసేపటి క్రితం ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు తన ఇంటినుండి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో వెల్లడించారు రాజమౌళి. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారని, తన గత సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా మంచి ఎమోషనల్ యాక్షన్ మూవీ గా నిలుస్తుందని అన్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో కలిసి షూటింగ్ చేయడం ఒక అద్బుతమైన ఎక్స్ పీరియన్స్ అని, ప్రస్తుతం దేశంలో లాకౌట్ జరుగుతున్న సందర్భంగా తమ సినిమా యూనిట్ ఇంటి నుండి వర్క్ చేస్తోందని, ఇది ముగిసిన తరువాత షూటింగ్ మళ్ళి మొదలెట్టి, వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి అనుకున్న విధంగానే జనవరి 8నే రిలీజ్ చేస్తాం అని రాజమౌళి అన్నారు….!!