‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి చేసేది ఆ హీరోతోనా….?

 97 total views,  2 views today

టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాతో బిజీగా వున్నారు. కాగా ఆయన తదుపరి  చిత్రం మహేష్ తో చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో కొద్దిరోజులుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా 2021 సంక్రాంతి కి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత కొంత విరామం తీసుకున్నారు.

అయితే దాని అనంతరం వంశీ పైడిపల్లి తో ఆయన తదుపరి సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా మహేష్ బాబు మాత్రం పరుశురాం చిత్రం ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి, ఆ తరువాత మహేష్ సినిమా విషయమై, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథ సిద్ధం చేస్తారట రాజమౌళి. అలానే రాజమౌళి తో సినిమా విషయమై మహేష్ బాబు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో, అతి త్వరలో ప్రారంభం కానున్న పరశురామ్ సినిమా పూర్తి అయిన తరువాత కానీ రాజమౌళి సినిమా ఉంటుందా ఉండదా అనేది స్పష్టత రాదని అంటున్నారు సినీ విశ్లేషకులు……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *