ఎన్టీఆర్ కి కూడా సర్ప్రైజ్ ఇవ్వబోతున్న జక్కన్న……??

 128 total views,  1 views today

టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తాజాగా నిర్మితం అవుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్రం ఇద్దరు అగ్ర కథానాయకులు అయిన ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తుండడం ఈ చిత్రానికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా జక్కన్న, ఎన్టీఆర్ చేతుల మీదుగా చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర ఇంట్రడక్షన్ ప్రోమో రిలీజ్ చేయించడం జరిగింది. కాగా ఆ వీడియో ఇంకా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్, లైక్స్ తో బాగా వైరల్ అవుతోంది.

rrr movie logo

తొలిసారిగా మెగా, నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారి మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఈ సినిమా పై దేశవ్యాప్తంగా అంచనాలు విపరీతంగా వున్నాయి. బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు ఆకాశమే హద్దుగా ఏర్పడ్డాయి. ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాకి సంబంధించి, జక్కన్న రామ్ చరణ్ కి బర్త్ డేకి స్పెషల్ ప్రోమో విడుదల చేసినట్టే, జూన్ లో రాబోతున్న ఎన్టీఆర్ బర్త్ డేకి కూడా ఆయన నటిస్తున్న కొమరం భీం పాత్ర ప్రోమో విడుదల చేస్తారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇదే కనుక నిజం అయితే నందమూరి ఫ్యాన్స్  ఆనందానికి అవధులు ఉండవు…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *