584 total views, 3 views today
టాలీవుడ్ లో ప్రస్తుతం దర్శకధీరుడిగా వరుసగా విజయాలు అందుకుంటూ కొనసాగుతున్న దర్శకుల్లో రాజమౌళి అగ్రస్థానాన నిలుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇటీవల ఆయన తీసిన బాహుబలి రెండు సినిమాలు కూడా ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయి మనకు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆయన తీస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీని అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి ఒక భారీ సినిమా తీయనున్నారు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్. నారాయణ అత్యధిక ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఇక దీనికి సంబంధించి కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రకారం అవుతుండడంతో రాజమౌళి నిన్న ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ప్రస్తుతం తాను తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అయి రిలీజ్ అయ్యేవరకు మహేష్ సినిమా గురించి ఆలోచించే ప్రసక్తి లేదని, మొదటి నుండి తనకు ఒకటి మొదలెట్టిన తరువాత అది పూర్తి అయిన తరువాతనే రెండవ దాని గురించి ఆలోచించే అలవాటు ఉందని రాజమౌళి అన్నారు. ఈ విధంగా మహేష్ సినిమా విషయమై ప్రచారం అవుతున్న ఫేక్ వార్తలు అన్నిటికీ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు రాజమౌళి ….!!