‘ఆర్ఆర్ఆర్’ విషయమై లోలోపల వణికిపోతున్న రాజమౌళి….??

 143 total views,  1 views today

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు ఇటీవల రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఖరారు చేసిన సినిమా యూనిట్ దాని మోషన్ పోస్టర్ ని, అలానే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా కొమరం భీం గా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదిగా రిలీజ్ చేయించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆ వీడియోలు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్, లైక్స్ తో దుమ్మురేపుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశం మొత్తం కూడా 21 రోజుల లాకౌట్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో ఆర్ఆర్ఆర్ షూట్ కూడా వాయిదా పడింది.

rrr movie logo

అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు మార్లు కొన్ని కారణాల వలన వాయిదా పడిందని, ఇప్పుడు ఈ విధంగా ఏకంగా దాదాపుగా నెల రోజులు వాయిదా పడే పరిస్థితి రావడంతో, అనుకున్న విధంగా వచ్చే ఏడాది జనవరి 8న సినిమా రిలీజ్ చేయగలమా లేదా అనే అనుమానం దర్శకుడు రాజమౌళిలో కలుగుతోందని అంటున్నారు. అయితే అదంతా ఒట్టిదే అని, మరోవైపు ఈ సినిమాకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కొంత జరుగుతోందని, తప్పకుండా ముందుగా అనుకున్న విధంగానే రాజమౌళి ఈ సినిమాని తప్పక రిలీజ్ చేస్తారని రాజమౌళి సన్నిహితులు చెప్తున్నట్లు టాక్….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *